ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిగ్‌బాస్‌ పై క్లారిటీ ఇచ్చిన హాట్‌ ఆంటీ

చిన్న వయసులోనే సీనియర్‌ హీరోలకు తల్లి పాత్రలో నటించిన ప్రగతి ఈ లాక్‌ డౌన్‌లో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయిన విషయం తెల్సిందే. ఆమె వర్కౌట్‌ చేస్తూ ఉన్న వీడియోలు మరియు ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. ఇక ఆమె చేసిన లుంగి డాన్స్‌ చాలా వైరల్‌ అయ్యింది. ఉన్నట్లుండి సోషల్‌ మీడియాలో ఇంతగా యాక్టివ్‌ అయ్యింది కేవలం బిగ్‌ బాస్‌ ఆఫర్‌ కోసం అంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఈమె ట్రెండ్‌ అవుతుండటం వల్ల బిగ్‌బాస్‌ ఆఫర్‌ దక్కించుకుంది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు అంతా సిద్దం అయ్యింది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. నాగార్జున పై యాడ్‌ చిత్రీకరణ చేశారు. ఈ నెల చివర్లో షో ప్రారంభం కాబోతుంది. ప్రగతికి చోటు దక్కింది అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో పాల్గొనబోవడం లేదు అంటూ పేర్కొంది. ఇందుకు గల కారణంను ఆశ్చర్యకంగా వివరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫేమస్‌ అవ్వాలనుకున్న వారు లేదంటే వారికి ఉన్న చెడ్డ పేరును మంచిగా మార్చుకోవడంకు లేదంటే వారికి ఉన్న పేరును మరో విధంగా మార్చుకునేందుకు వెళ్తారని కాని నాకు ఆ అవసరం లేదు అంది. నాకు ఇప్పటికే ఫేమ్‌ దక్కింది. నేను నటించిన సినిమాలతో ఎక్కడకు వెళ్లినా కూడా జనాలు నన్ను గుర్తు పడుతారు. ఇక నాకు చెడ్డ పేరు కూడా ఏమీ లేదు కనుక బిగ్‌ బాస్‌ వెళ్లి ఏదో సాధించాలని నాకు లేదని ప్రగతి పేర్కొంది. దీంతో ఆమె ఈ సీజన్‌లో లేదని క్లారిటీ వచ్చేసింది.

Exit mobile version