సల్మాన్ ఖాన్-ఆయుష్ శర్మ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే వచ్చిన అంతిమ్ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహిమ మక్వాన ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ప్రగ్యా జైస్వాల్ సల్మాన్ ఖాన్ తో నటించనుంది. వీరిద్దరికీ ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని సమాచారం. మహాబలేశ్వర్ లో సాగుతోన్న తాజా షెడ్యూల్ లో ఈమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.