Advertisement

తెగేదాకా లాక్కండి.. ప్రకాష్‌ రాజ్‌ జస్ట్‌ ఆస్కింగ్‌

Posted : August 8, 2021 at 11:44 am IST by ManaTeluguMovies

‘మా’ ఎన్నికల విషయం ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున పోటీకి సిద్దం అవుతున్న సమయంలో కొందరు మాత్రం ఈ ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయితే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మెగా కాంపౌండ్ వారు ప్రకాష్‌ రాజ్‌ కు మద్దతు ఇస్తుండగా మంచు విష్ణు కాంపౌండ్‌ వారికి బాలయ్య నుండి సహకారం అందుతుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మా ఎన్నికల వేడి రాజుకోగా కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని మొదట భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు నిలిపి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు నరేష్‌ ప్యానల్‌ అధికారంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఇక ఎన్నికల విషయంలో ప్రకాష్‌ రాజ్ పదే పదే ట్వీట్స్ చేస్తున్నాడు. తాజాగా తెగేదాకా లాక్కండి.. అంటూ ట్వీట్ చేసి జస్ట్‌ ఆస్కింగ్‌ అన్నాడు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నాడో అనేది క్లారిటీ లేదు. కాని మా ఎన్నికల గురించి ట్వీట్‌ చేశాడు అనేది మాత్రం పక్కా.


Advertisement

Recent Random Post:

A2 Durga Rao Face To Face Over Stone Attack On CM Jagan

Posted : April 21, 2024 at 8:25 pm IST by ManaTeluguMovies

A2 Durga Rao Face To Face Over Stone Attack On CM Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement