సౌత్ సినిమాలు ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించడం అంటే ఘన కార్యం.. అద్బుతం అన్నట్టుగా ఉండేది. బాలీవుడ్ సినిమాలు వంద కోట్లు.. 150 కోట్లు వసూళ్లను రాబడుతూ ఉంటే తెలుగు సినిమాల ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు నోరు వెళ్ళబెట్టి చూసేవారు. కానీ ఇప్పుడు సౌత్ సినిమా ల కలెక్షన్స్ చూసి బాలీవుడ్ వర్గాల వారు నోరు పెడుతున్నారు… హిందీ సినీ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
బాహుబలి 2 సినిమా తో వెయ్యి కోట్ల మార్క్ ను దాటేసి రాజమౌళి తాజాగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సారి వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేశాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు సైతం సాధ్యం కాని వెయ్యి కోట్ల మార్కుని దక్కించుకున్న అరుదైన దర్శకుడు అనే రికార్డును రాజమౌళి సొంతం చేసుకున్నాడు. ఇప్పట్లో రాజమౌళి రికార్డుని బ్రేక్ చేయడం గాని ఆయనతో సమం అవ్వడం గాని ఎవరికీ సాధ్యం కాదు అనుకుంటున్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్ల మార్కుని టచ్ చేసి జక్కన్న సరసన నిలిచాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్ 2 చిత్రం ఘన విజయం సొంతం చేసుకొని వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి మరింత దూసుకు వెళుతోంది. లాంగ్ రన్ లో మరెంతగా ఈ సినిమా వసూళ్లు ఉంటాయో చూడాలి.