Advertisement

ముద్దు గన్ పిల్ల సోషల్ మీడియాకు దూరం అవ్వడానికి కారణం అదేనా?

Posted : May 18, 2020 at 10:26 pm IST by ManaTeluguMovies

మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ముద్దు గన్ పేల్చిన ముద్దుగుమ్మ అంటే అందరికి ఠక్కున గురుతుకు వస్తుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఈమె ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఈమె క్రేజ్ మాములుగా ఉండదు అనే విషయం తెలిసిందే. మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఈమె సొంతం.

ఇంతటి క్రేజ్ ను దక్కించుకున్న ప్రియా ప్రకాష్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఈమె అసలు ఎందుకు సోషల్ మీడియా లో లేకుండా పోయింది అంటూ రకరకాలుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా ద్వారా సంచలనం గా మారిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాను వదిలేయడానికి కారణం ఏంటా అంటూ ఎవరికీ తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు.

తాజాగా ఈ విషయమై ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్నా బ్యాడ్ కామెంట్స్ ను తట్టుకోలేకే ఈమె ఏకంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈమె ను కొందరు టార్గెట్ చేసి మరి కామెంట్స్ చేస్తున్నారట. ఆ విషయం తో తీవ్ర మనస్ధాపంకు గురి అయిన ప్రియ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Mirai Telugu Glimpse | Teja Sajja | Karthik Gattamneni | TG Vishwa Prasad

Posted : April 18, 2024 at 9:11 pm IST by ManaTeluguMovies

Mirai Telugu Glimpse | Teja Sajja | Karthik Gattamneni | TG Vishwa Prasad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement