బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ప్రియాంక చోప్రా కూడా ఈ కోవలోకే చెందుతుంది. తనపై వచ్చిన మీమ్స్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. తన రోజును సంతోషంగా మార్చినందుకు ధన్యవాదాలు అని తెలిపింది.
ఇక విషయంలోకి వెళితే గుండ్రటి బంతి ఆకారంలో ఉన్న డ్రెస్ ను ఇటీవలే వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియాంక. చూడటానికి చాలా వెరైటీగా ఉండడంతో ప్రియాంక చోప్రాపై మీమ్స్ నిమిషాల్లో పుట్టుకొచ్చాయి. ఆమె కూడా సరదాగా తీసుకోవడంతో అంతా హ్యాపీ.