తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తన పేరును పలు సామాజిక సంస్థలు మరియు ప్రజా సంఘాలు ప్రతిపాధించిన కారణంగా తాను పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నాడు.
ఇదే నియోజక వర్గం నుండి2007 మరియు 2009లో స్వతంత్ర్య అభ్యర్థిగా నాగేశ్వర్ పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2014 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దం అయ్యారు. ఈ స్థానంపై టీఆర్‌ఎస్ పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంది.
నాగేశ్వర్ బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో మొత్తం సమీకరణాలు మారిపోయాయి. అసలు ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.