రామ్ చరణ్ ను చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరి జగన్నాద్ అనే విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబో సినిమా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈలాక్ డౌన్ లో పూరి పలు కథలను సిద్దం చేశాడు. అందులో ఒకటి చరణ్ కు బాగా నచ్చడంతో పూరి దర్శకత్వంలో నటించాలని భావించాడట. ఈ విషయంలో ఇంకా ఎలాంటి చర్చలు అయితే జరగలేదు. కాని త్వరలోనే పూరి స్వయంగా చరణ్ మరియు చిరులను కలిసి కథ చెప్పే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
చరణ్ ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. చాలా కథలు విన్న చరణ్ ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. దాంతో పూరితో సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ మరియు పూరి ఫైటర్ సినిమాలు పూర్తి అయిన తర్వాత కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.