ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ట్రైలర్‌ బాగుంది

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్‌ ఎమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్‌ వెరైటీగా ఉంది. ట్రైలర్‌ బాగుంది. హీరో హీరోయిన్లుగా పవన్, మేఘన బాగా కనిపిస్తున్నారు. అభిరామ్‌ డైరెక్షన్‌ బాగుంది. నిర్మాత రాజేష్‌కు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలి’’ అని అన్నారు. ఈ సినిమాకు కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అందించారు.

Exit mobile version