పుష్ప సినిమా లోని బన్నీ లుక్ ను పరిచయం చేసేందుకు విడుదల చేసిన వీడియో కేవలం 19 రోజుల్లో ఏకంగా 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ మరియు ఎన్టీఆర్ ల లుక్ పరిచయం చేస్తూ వచ్చిన వీడియోలను మించి పుష్ప వీడియో వ్యూస్ దక్కించుకుంది. ఎన్టీఆర్ కొమురం భీమ్ వీడియో మాత్రమే 50 మిలియన్ ల క్లబ్ లో చేరింది. అది కూడా దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. ఇక గత ఏడాది వచ్చిన రామరాజు వీడియో ఇంకా 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోలేదు. దీన్ని బట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమాలను మించి పుష్పకు రేంజ్ ఉందంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.