విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మూడు నుండి నాలుగు వారాల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందన్నారు. దాన్ని రెండు నుండి మూడు వారాలకు కుదించి త్వరగా పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. అందుకోసం సినిమాను జులై 5న పునః ప్రారంభించాలని భావిస్తున్నారు. జులై మొదటి వారం నుండి అన్ని పెద్ద సినిమాలు కూడా మళ్లీ షూటింగ్ లు మొదలు పెట్టబోతున్నారు. పుష్ప కూడా ప్రారంభం కాబోతుంది. జులై లోనే సినిమా పూర్తి అవ్వబోతుంది. కనుక థియేటర్లు ఓపెన్ అయ్యి 100 శాతం ఆక్యుపెన్సీతో నడిస్తే ఖచ్చితంగా సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.