Advertisement

ఇన్ సైడ్ స్టోరీ: ‘పుష్ప’ రెండు పార్ట్‌ లకు వేరు వేరు విలన్స్‌

Posted : July 5, 2021 at 10:28 am IST by ManaTeluguMovies

అల్లు అర్జున్‌ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా పుష్ప. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ షూటింగ్‌ 70 శాతం వరకు పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది. బ్యాలన్స్ షూటింగ్ ను ఈ నెల చివరి వరకు మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ సినిమా గురించి మీడియా వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా రూపొందబోతున్న నేపథ్యంలో ఇద్దరు విలన్స్ ఉంటారని అంటున్నారు.

పుష్ప మొదటి పార్ట్‌ లో పూర్తిగా సునీల్ విలనిజంతో దుమ్ము రేపుతాడట. సునీల్ విలన్ గా మొదటి పార్ట్ లో కనిపించబోతున్నాడు. చివరి అర్థ గంట మాత్రమే మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్‌ ఫాజిల్ కనిపిస్తాడట. ఇక రెండవ పార్ట్‌ లో సునీల్ కనిపించడు.. పూర్తిగా ఫాహద్‌ ఫాజిల్ విలనిజంతో సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌ ల మద్య కొన్ని నెలల గ్యాప్ ఉంటుందట. ఆ గ్యాప్ లో ఐకాన్‌ సినిమాను బన్నీ చేస్తాడని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Nominations For AP & Telangana Including 10 States To Start Today

Posted : April 18, 2024 at 1:01 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement