ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పుష్పకు అసలు సమస్య అదే

సుకుమార్ పుష్ప సినిమా సెట్ మీదకు ఎప్పుడు వెళ్తుంది. ఇది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. సినిమా ప్రారంభంలో కేరళ అడవులు లొకేషన్ అనుకున్నారు. కానీ ముందుగా కరోనా అక్కడే వచ్చింది. దాంతో మారేడుమిల్లి అడవులకు షిప్ట్ అనుకున్నారు. కానీ మళ్లీ బ్రేక్ పడింది. కరోనా వచ్చి అయిదునెలలు దాటేసింది. దర్శకుడు సుకుమార్ ఇంట్లోంచి కాలు బయటకు పెట్టడం లేదు.

హీరో బన్నీ రెడీనే. కానీ లోకేషన్ ఎక్కడ? ఇటీవల అడవుల కోసం డైరక్టర్ క్రిష్ వికారాబాద్ ను ఎంచుకోవడంతో పుష్ప టీమ్ కన్ను కూడా వికారాబాద్ మీద పడింది. కానీ అసలు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అన్నా ముందుగా సుకుమార్, సినిమాటోగ్రాఫర్, హీరో ఇలా అందరూ కలిసి మాట్లాడుకోవాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ముఖ్యంగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పోలెండ్ కు చెందిన Miroslaw Brozek. ఈయన కరోనా ఎంట్రీ టైమ్ లోనే ఆ దేశానికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన రావాలంటే అన్నీ క్లియర్ కావాలి. అందువల్ల పుష్ప సినిమా సెట్ మీదకు వెళ్లాంటే ఎప్పుడు వీలు అవుతుందన్నది అనుమానమే. కరోనా భయం పూర్తిగా పోతే తప్ప సుకుమార్ ఇంటి నుంచి బయటకు రారు. సినిమాటోగ్రాఫర్ విదేశాల నుంచి రారు.

అప్పుడు కానీ లోకేషన్ డిసైడ్ కాదు. షూటింగ్ ప్రారంభం కాదు. ఆ తరువాత సంగతి ఎప్పటికి పూర్తి అవుతుంది? విడుదల ఎప్పుడు వుండొచ్చు అన్నది.

Exit mobile version