పుష్ప మాస్ ని థియేటర్లకు తెస్తున్నాడు. దీంతో రెండో రోజుకే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ను అధిగమించింది. తెలుగురాష్ట్రాలు సహా ఇరుగు పొరుగునా ఉత్తరాదినా పుష్ప అత్యంత భారీగా విడుదలైంది. అయితే హిందీ వెర్షన్ కి ఆశించిన వసూళ్లు లేవన్న టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో పూర్తి కలెక్షన్లు రాబడుతుండగా ఇతర రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండవ రోజు వసూళ్ల లెక్కలు బావున్నాయని తెలిసింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత లవ్ స్టోరి- అఖండ చిత్రాలు చక్కని వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఇదే వరుసలో పుష్ప అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అమెరికాలో ఇప్పటికే పుష్ప హవా సాగుతోంది. అక్కడ ప్రీమియర్లు కలుపుకుని ఇప్పటికి 9కోట్లు (1.3 మిలియన్లు) వసూలు చేసింది. 2 మిలియన్ల క్లబ్ లో చేరడం కష్టమేమీ కాదని అంచనా.
నైజాంలో టిక్కెట్టు ధరతో ఈ చిత్రం రికార్డ్ లు బ్రేక్ చేస్తోందని సమాచారం ఉంది. ఉత్తరాంధ్ర- సీడెడ్ లో కూడా కలెక్షన్లు గొప్పగా ఉన్నాయి. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అద్బుత ప్రదర్శన .. రష్మిక నటన.. సహా ఫారెస్ట్ నేపథ్యం సినిమాకి పెద్ద ప్లస్ అన్న టాక్ వచ్చింది. ముఖ్యంగా కథానాయికతో రొమాన్స్ .. భారీ యాక్షన్ సన్నివేశాల్లో బన్ని ఇరగదీశాడని టాక్ వైరల్ అవ్వడంతో మాస్ ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. అయితే పుష్పకు సోమవారం నుంచి కఠిన పరీక్ష ఎదురు కానుంది. 2022 ఫిబ్రవరి చివరి నుండి రెండవ భాగం షూటింగ్ ని ప్రారంభించనున్నారని తెలిసింది. ఆ మేరకు సుకుమార్ అధికారికంగానే ప్రకటించడం ఆసక్తికరం. ఇక పార్ట్ 2లోనే అసలు కథంతా రక్తి కట్టిస్తుందని సుకుమార్ తెలిపారు. మొదటి పార్ట్ లో ద్వితీయార్థం ల్యాగ్ రావడానికి కారణం రెండో భాగం కోసం పాత్రల లీడ్ తీసుకోవడమేనని వివరణ ఇచ్చారు.