Advertisement

బన్నీ `పుష్ప` థియేట్రికల్ రన్ ఫైనల్ కలెక్షన్స్

Posted : January 17, 2022 at 3:42 pm IST by ManaTeluguMovies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని విధింగా వసూళ్ల సునామీని సృష్టించింది. రీజినల్ మూవీగా విడుదలై నేషనల్ లెవెల్లో వాసూళ్లు కురిపించింది. పాన్ ఇండియా స్థాయి సినిమాగా జేజేఅందుకుంది. ఓటీటీ లో రిలీజ్ సంక్రాంతి సీజన్ కి ముందు భారీగానే వసూళ్లని రాబట్టిన ఈ మూవీ హవా రాను రాను తగ్గిపోతోంది.

థీయేట్రికల్ విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మందగమనంతో సాగుతోంది. అంటే `పుష్ప` థియేట్రికల్ రన్ ఆల్ మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసిందన్నమాట. ఈ మూవీ విడుదలై ఈ సోమవారం అంటే జనవరి 17కు నెలరోజులు కావస్తోంది. దీంతో థియేటర్లల కలెక్షన్లు పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా లేవు. చాలా వరకు డ్రాప్ అయిపోయాయి. దీన్ని బట్టి `పుష్ప` థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు.

డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ సాధించిన వసూళ్లని చూసి ట్రేడ్ పండితులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్ టాక్ తో ఈ మూవీ హిందీ వెర్షన్ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. మిందీతో పాటు తమిళనాడు రీజియన్ లోనూ తమిళ వెర్షన్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఈ రెండు రీజియన్ లలో `పుష్ప` బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంటుందని ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుందని హీరో బన్నీ దర్శకుడు సుకుమార్ మేకర్స్ ఊమించలేదు. దీంతో ఊహించని ఫలితం రావడంతో అంతా విస్మయానికి గురవుతున్నారట. అంతే కాకుండా హిందీ వెర్షన్ సాధించిన వసూళ్లని చూసి ట్రేడ్ పండితులు సైతం అవాక్కవుతున్నారట. ఇక ఈ మూవీ కన్నడ వెర్షన్ తో పాటు ఆంధ్రా రీజియన్ లో పెద్దగా లాభాల్ని అందించలేకపోయింది.

ఆ విషయంలో ఫెయిలైందని చెప్పొచ్చు. ఆంధ్రాలో టికెట్ రేట్లు తగ్గించడం ఈ సినిమాకు శాపంగా మారింది. ఆంధ్రా సీడెడ్ ఏరియాల్లో ఈ మూవీ భారీగా నష్టాలని చవిచూడాల్సి వచ్చింది. అంతే కాకుండా బన్నీకిఒ భారీ క్రేజ్ వున్న కేరళలోనూ ఈ మూవీ ప్రభావాన్ని చేపించలేకపోవడం గమనార్హం. దీంతో అక్కడ సూపర్ హిట్ గా మిగిలిందే కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో `పుష్ప` ఫైనల్ కలెక్షన్స్ ఈ విధంగా వున్నాయి.

నైజామ్ : 39 కోట్ల షేర్
సీడెడ్ : 15.80 కోట్ల షేర్
ఆంధ్రా : 30 కోట్ల షేర్
కేరళ : 11. 50 కోట్లు నెట్
కర్ణాటక : 9.30 కోట్ల షేర్
తమిళనాడు : 22 కోట్ల గ్రాస్
నార్త్ ఇండియా : 85 కోట్లు నెట్
యుఎస్ ఏ 2.4 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది.


Advertisement

Recent Random Post:

Chittoor : సీఎం జగన్ పై దాడికి నిరసనగా వైసీపీ శ్రేణుల ఆందోళన

Posted : April 14, 2024 at 9:48 pm IST by ManaTeluguMovies

Chittoor : సీఎం జగన్ పై దాడికి నిరసనగా వైసీపీ శ్రేణుల ఆందోళన

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement