ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ భక్తులు ఏరీ, ఎక్కడ.?

‘కొంతమంది హీరోలకి అభిమానులంటారు.. కానీ, పవన్ కళ్యాణ్‌కి మాత్రం భక్తులంటారు..’ అంటాడొకాయన. ‘ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధం..’ అంటాడు ఇంకొకాయన. మరొకాయన అయితే, ‘ఆయన స్థానం వేరు.. ఆ స్థాయి వేరు..’ అని చెబుతాడు. ఏరీ ఈ భక్తులంతా.? ‘నా సినిమాల్ని ఆపేస్తారా.? నా ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేస్తారా.? అయినా, నాకేమీ నష్టం లేదు. డబ్బుల్లేకపోతే నేనేమైనా చచ్చిపోతానా.? మీ ఇంటికి వస్తే, నాకు భోజనం పెట్టరా.?’ అంటూ పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తల్ని ఉద్దేశించి, అభిమానులను ఉద్దేశించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.?

అసలు పవన్ కళ్యాణ్ ఎవరి తరఫున మాట్లాడారు.? పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ గుంపు చేరి, ఆయన వద్ద పరిశ్రమ సమస్యల్ని ఏకరువు పెట్టి, ‘మమ్మల్ని కాపాడండి మహాప్రభో..’ అని వేడుకుంటే, పవన్ కళ్యాణ్.. వారి తరఫున మాట్లాడారు. సరే, వెన్నపోటు పొడిచేటోళ్ళు ఎప్పుడూ వుంటారు. అలాంటివారి గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ‘జాగ్రత్త అన్నా.. నీ ఎదురుగా నవ్వుతున్నాడు.. నీకు జేజేలు పలుకుతున్నాడు.. కానీ, నీ వెనకాల కుట్ర పన్నుతున్నాడు..’ అంటూ పలు సందర్భాల్లో కొందరు సినీ ప్రముఖుల గురించి అభిమానులు హెచ్చరిస్తూ వచ్చారు. వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని వెన్నుపోటు పొడిచారు.

కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం.. బలంగా నమ్మిన కొందరు వ్యక్తులు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని వెన్నుపోటు పొడవడాన్ని అభిమానులూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా వెన్నుపోటు పొడిచినవారిలో నటులున్నారు, దర్శకులున్నారు, నిర్మాతలున్నారు. ‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు..’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటన విడుదల చేయడమా.? అసలు పవన్ కళ్యాణ్ వేరు, సినీ పరిశ్రమ వేరు.. అని ఇంకొకరు మాట్లాడతారా.? సినీ పరిశ్రమలో వున్న సోకాల్డ్ పవన్ భక్తులు ఇప్పుడేమైపోయారు.?

ఒక్క ట్వీటు వేస్తే, తమ కెరీర్ నాశనమైపోతుందని భయపడేటోళ్ళు ‘స్థాయి’ గురించీ, ‘స్థానం’ ఎందుకు మాట్లాడినట్టు.? పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పొగడ్తలకి పొంగిపోలేదు.. కానీ, పవన్ కళ్యాణ్ మీద పొగడ్తలు కురిపించి.. కొందరు పాపులారిటీ పెంచుకున్నారు. అలాంటోళ్ళ నమ్మకద్రోహాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారిప్పుడు.

Exit mobile version