Advertisement

రాశిఖన్నా తన తల్లికిచ్చిన ఖరీదైన కానుక ఇదే!

Posted : May 10, 2022 at 3:50 pm IST by ManaTeluguMovies

అమ్మ అంటే అనంతమైన అనురాగానికి కేరాఫ్ అడ్రెస్. తన పిల్లల కోసం అమ్మ ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన పిల్లల ఆనందంలో తాను సంతోషాన్ని పొందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని పాత్ర అనేది ఒకటి ఉందంటే అది అమ్మనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి అమ్మకి ఎంతటి ఖరీదైన కానుకలు ఇచ్చినప్పటికీ ఆ రుణం తీర్చుకోలేనిదే. అయినా పిల్లలు తమ సంతోషం కొద్దీ ఆయా సందర్భాలలో తల్లికి కానుకలను సమర్పించుకుంటూ ఉంటారు. అలా రాశి ఖన్నా తన తల్లికి ఒక ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చింది.

‘మదర్స్ డే’ సందర్భంగా రాశి ఖన్నా తన తల్లికి BMW కారును కొని పెట్టింది. దాని విలువ 1.4 కోట్లు కావడం విశేషం. తమ కూతురు అంతటి ఖరీదైన కారును తమకి గిఫ్టుగా ఇచ్చే స్థాయికి చేరుకోవడం పట్ల ఆమె పేరెంట్స్ మురిసిపోతున్నారు.

తల్లిదండ్రులతో కలిసి కొత్త కారుతో రాశి ఖన్నా దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరియర్ విషయానికి వస్తే రాశి ఖన్నా కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టేసి పదేళ్లు కావొస్తోంది. ఈ పదేళ్లలో తెలుగుకి సంబంధించినంతవరకూ కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్ .. బెంగాల్ టైగర్ .. సుప్రీమ్ .. తొలిప్రేమ వంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో కనిపిస్తాయి. నిజానికి రాశి ఖన్నాకి ఉన్న గ్లామర్ కీ .. ఆ మాత్రం నటనకి ఇంకా చాలా సినిమాలు చేసి ఉండవలసింది. ఇతర భాషలలోను చక్రం తిప్పేసి ఉండవలసింది. కానీ తనంతట తాను అవకాశాల కోసం ప్రయత్నించిన దాఖలాలు రాశి ఖన్నా కెరియర్లో కనిపిస్తాయి. తన దగ్గరికి వచ్చిన పాత్రలు మాత్రమే చేయడం .. లౌక్యం తెలియకపోవడం ఆమె తక్కువ సినిమాలు చేయడానికి కారణమని చెప్పాలి.

ఈ మధ్య రాశి ఖన్నాకి కాస్త తత్వం బోధపడినట్టుగా కనిపిస్తోంది. అందువల్లనే ఒక వైపున తెలుగు సినిమాలు చేస్తూనే తమిళ .. మలయాళ భాషలపై కూడా దృష్టి పెడుతోంది. ఇక ఇదే నేపథ్యంలో హిందీ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ లను చేస్తోంది. అలా ప్రస్తుతం ఆమె చాలా బిజీగానే ఉంది. తెలుగులో రాశి ఖన్నా చేసిన ‘పక్కా కమర్షియల్’ సినిమా విడుదలకి ముస్తబవుతోంది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. ఇక చైతూ సరసన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘థ్యాంక్యూ’ కూడా విడుదల దిశగా అడుగులు వేస్తోంది.


Advertisement

Recent Random Post:

Dharani with Ravanasura Candid Conversation Full Video | MASS MAHARAJA Ravi Teja | NATURAL STAR Nani

Posted : March 25, 2023 at 4:30 pm IST by ManaTeluguMovies

Watch Dharani with Ravanasura Candid Conversation Full Video | MASS MAHARAJA Ravi Teja | NATURAL STAR Nani

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement