Advertisement

తప్పుదిద్దుకున్న రాశిఖన్నా

Posted : April 30, 2020 at 9:55 pm IST by ManaTeluguMovies

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో రాశిఖన్నా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాపై రాశి చాలా ఆశలు పెట్టుకుంది. వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అవుతున్న సమయంలో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సక్సెస్‌ అయితే మరికొన్ని ఆఫర్లు వస్తాయనే ఉద్దేశ్యంతో కాస్త బోల్డ్‌గా కూడా ఆ సినిమాలో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశిఖన్నా మాట్లాడుతూ నేను వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం చేయకుండా ఉండాల్సిందని, అలాంటి సీన్స్‌లో నటించకుండా ఉంటే బాగుండేది అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

వరల్డ్‌ పేమస్‌ లవర్‌ చిత్రంలో తాను బోల్డ్‌ సీన్స్‌ చేసి తప్పు చేసినట్లుగా ఆమె వ్యాఖ్యలు చేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. సీన్స్‌ చేసే ముందు తెలియదా. సినిమా సక్సెస్‌ కాకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు ఎంత వరకు కరెక్ట్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ విషయమై తాజాగా రాశిఖన్నా స్పందించింది. తాను అసలు అలాంటి వ్యాఖ్యలే చేయలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాను కూడా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. నేను నా ప్రతి సినిమా పట్ల సంతృప్తితో ఉన్నాను. ఎప్పుడు ఏ సినిమా చేసినందుకు కూడా నేను బాధ పడ్డ సందర్బాలు లేవంటూ చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ఇప్పటికప్పుడు మాట మార్చింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం రాశి ఖన్నా తన తప్పుదిద్దుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉన్న ఒకటి రెండు సినిమాలు కూడా పెద్దగా ఆసక్తిని కలిగి లేవు. కనుక ఈ అమ్మడు త్వరలోనే టాలీవుడ్‌లో కనుమరుగయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Advertisement

Recent Random Post:

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Posted : April 24, 2024 at 8:32 pm IST by ManaTeluguMovies

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement