ప్రభాస్ లుక్ ను పోస్టర్ గా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ పేరుని కూడా రివీల్ చేసారు. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. పోస్టర్ కూడా చాలా వైబ్రన్ట్ గా ఉంది. వింటేజ్ కార్ల మధ్యలో ప్రభాస్ అదిరిపోయాడనే చెప్పాలి. ఇటీవలే పూజ హెగ్డే క్యారెక్టర్ పేరుని కూడా రివీల్ చేసిన విషయం తెల్సిందే. ప్రేరణ పేరుతో పూజ ఈ సినిమాలో కనిపించనుంది.
రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ రాధే శ్యామ్ ను నిర్మిస్తోంది.