ఇకపోతే ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన సమయానికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అసాధ్యమనే చెప్పాలి. అయితే ప్రభాస్ సినిమా కోసం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
‘రాధే శ్యామ్’ సినిమాకి దాదాపు రూ. 400 కోట్ల భారీ డీల్ ఆఫర్ చేస్తున్నట్లు ఓటీటీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై టీ సిరీస్ – యూవీ క్రియేషన్స్ వారితో చర్చలు జరుగుతున్నాయట. గతంలో కూడా 300 కోట్ల ఆఫర్ తో వచ్చిన ఓటీటీ డీల్ ని మేకర్స్ రిజెక్ట్ చేశారు. ‘రాధే శ్యామ్’ చిత్రానికి 300 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నట్లు టాక్. మరి ఇప్పుడు అమెజాన్ వారు చెప్తున్న ప్రైజ్ నిజమే అయితే లాభసాటి భేరమనే అనుకోవాలి. మరి నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తారా లేదా ఓటీటీ ఆఫర్ కి టెంప్ట్ అవుతారా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.