ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బ్లాక్ బస్టర్ హిట్ కి సీక్వెల్ తీస్తున్న దర్శకేంద్రుడు

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొంతమంది సీక్వెల్స్ చేయడానికి ఇష్టపడుతుంటే, కొంతమంది క్లాసిక్స్ ని టచ్ చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తను తీసిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమానే ‘పెళ్లి సందడి’.

ట్రై యాంగిల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో పాటు ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా శ్రీకాంత్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ‘పెళ్లి సందడి’. తాజా సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కథ ఫైనల్ డ్రాఫ్ట్ అవ్వగానే నటీనటులుగా ఎవరిని తీసుకోవాలనేది ఆలోచిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమా చేసి రాఘవేంద్ర రావు దర్శకుడిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నారు.

ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలే కాకుండా దిల్ రాజు తో కలిసి సంయుక్తంగా రాఘవేంద్ర రావు నిర్మించనున్నారు. చెప్పాలంటే పెళ్లి సందడి ఓ క్లాసిక్ ఫన్ ఫామిలీ ఎంటర్టైనర్. స్వప్న సుందరి అనే కాన్సెప్ట్ ని ఇంకా పలు సినిమాల్లో వాడుతూనే ఉంటారు. మరి సీక్వెల్ చేసేది ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావే అయినప్పటికీ ఆ మ్యాజిక్ ని ఎంత వరకూ రిపీట్ చేయగలరనేది ఆయన ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్

Exit mobile version