ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజు గారికి ఎదురులేదహో… ?

ఆయన జాతకమే జాతకం. ఎంపీ కావాలని వైఎస్సార్ కాలం నుంచి అనుకుంటే తనయుడు జగన్ టైమ్ లో సార్ధకం అయింది. ఇలా ఎంతో సుదీర్ఘమైన నిరీక్షణ ఫలితంగా వచ్చిన ఎంపీ పదవిని ఆయన ఊరకనే అలా వదులుకుంటారా అన్న చర్చ అయితే ఎపుడూ జరుగుతూనే ఉంది.

అయితే తన ఫోటో పెట్టుకుని గెలిచి తనకే ఎదురు నిలిచిన రఘు రామ క్రిష్ణం రాజు పదవిలో ఉండకూడదు అన్నది జగన్ పంతం. అందుకోసమే రెండేళ్ల క్రితం ప్రత్యేక విమానం వేసుకుని మరీ వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి రాజు గారి మీద అనర్హత పిటిషన్ స్పీకర్ ఎదుట దాఖలు చేశారు.

లోక్ సభ స్పీకర్ సాధ్యమైనంత త్వరగా దాని మీద డెసిషన్ తీసుకోవాలని కూడా వారు కోరారు. ఈ నేపధ్యంలో ఎన్నో మలుపులు కధ తిరిగింది. బీజేపీకి రాజు గారు అత్యంత సన్నిహితుడు కావడం ఆయనకు కేంద్రంలోని పార్టీతో ఉన్న గుడ్ రిలేషన్స్ అన్నీ కలసి అనర్హత పిటిషన్ విషయమే కొంతకాలం పాటు మరచిపోయేలా చేశాయని చెబుతారు.

ఇక దాని మీద పెద్ద ఎత్తున రాజకీయ వత్తిడి పడితే తప్ప ఫైల్ ముందుకు కదలదు అని కూడా అంతా అనుకుంటున్న వేళ అలాంటి సందర్భమే వచ్చేసింది అనుకున్నారు.

బీజేపీకి ఉత్తరాది రాష్ట్రలా ఎన్నికల ఫలితాలు బాగా దెబ్బ కొడతాయని దాంతో ఏపీలోని వైసీపీ మద్దతు బాగా అక్కరకు వస్తుందని లెక్కలేశారు. దాంతో రాజు ని బీజేపీ దూరం పెట్టడం ఖాయమని కూడా కధలు వినిపించాయి.

సీన్ కట్ చేస్తే బీజేపీ అయిందిట నాలుగు రాష్ట్రాలను గెలుచుకుంది. దాంతో కమలం ఫుల్ జోష్ లో ఉంది. పైగా ఎవరి అవసరం ఆ పార్టీకి ఇప్పట్లో పడే చాన్సే లేదు. దాంతో ఏపీలో వైసీపీ డీలా పడుతోంది.

ఇక మరిన్నాళ్ళు రాజు గారి అనర్హత పిటిషన్ కదిలే ప్రసక్తే లేదని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ గెలుపు కాదు కానీ రాజు గారు అయితే ఆ పార్టీ కంటే ఎక్కువగా హ్యాపీ మూడ్ లో ఉన్నారని తాజా టాక్.

ఇక రాజు గారి అనర్హత పిటిషన్ కదలకపోతే ఆయన రాజీనామా చేసే సీన్ కూడా అసలు ఉండదు. మరి రాజు గారు ఏం చేస్తారు అంటే ఆయన చాలానే చేస్తారు. దమ్ముంటే నా అనర్హత పిటిషన్ ఆమోదించుకోండి అని లేటెస్ట్ గా మరో చాలెంజిని విసరడానికి కూడా తయారు గా ఉంటారు.

ఎంతైనా ఇది రాజు గారి టైమ్. ఆయనకు ఎదురులేదంటే లేదుగా. సో అయిదేళ్ళ పాటు ఆయనే నర్సాపురం ఎంపీ. నో ఉప ఎన్నిక. ఇప్పటికి ఇది ఫిక్స్ అయిపోవడమే.

Exit mobile version