ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘ఆర్ఆర్ఆర్’, టాలీవుడ్ డైరెక్టర్స్ కి ఉన్న ఛాలెంజెస్ ఇవే- ఎస్ఎస్ రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి సినిమా సినిమాకి కొత్త ఛాలెంజెస్ పెట్టుకొని పనిచేస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం సౌత్ ఇండస్ట్రీస్ మరియు నార్త్ మూవీ ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. దానికి మొదటి కారణం ఎస్ఎస్ రాజమౌళి – ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రానున్న ఫస్ట్ మల్టీ స్టారర్ కావడమే. ఛాలెంజెస్ ఇష్టపడే రాజమౌళికి ఈ కరోనా ఎఫెక్ట్ మరికొన్ని టఫ్ ఛాలెంజెస్ ఇచ్చింది. ఛాలెంజెస్ ఉన్నప్పుడే నా బ్రెయిన్ ఇంకా ఫాస్ట్ గా పని చేస్తుంది అంటున్నారు మన రాజమౌళి.

అసలు విషయంలోకి వెళితే.. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ఆర్ నెక్స్ట్ ప్లాన్స్ గురించి వివరించాడు. ‘ఆర్ఆర్ఆర్ బాలన్స్ షూట్ కి సంబందించిన వర్క్ మొత్తాన్ని రీ షెడ్యూల్ చేస్తున్నాం. మా చిత్ర టీంలో కొందరు అబ్రాడ్ లో, మరికొందరు ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఇరుక్కొని ఉన్నారు. అందుకే షెడ్యూల్స్ అన్నీ మారుస్తున్నాం. ఒకవేళ షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తే మొదట తక్కువ మందితో తీయగలిగే సీన్స్ లిస్ట్ చేస్తున్నాం. అలాగే టెక్నీషియన్స్ కూడా పలు చోట్ల లాక్ అయ్యారు. ఇక్కడ ఉన్న టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో సెట్స్ అన్నీ ఎలా వేయగలం అని ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. విదేశీ టీంతో జరిపే షూటింగ్ పార్ట్ ని చివరకు వేసాం. సవాళ్లు ఉన్నప్పుడే నాలో ఎడ్రినలిన్ రష్ ఎక్కువ ఉంటుంది, అలాగే నా బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుందని’ రాజమౌళి అన్నారు.

అలాగే ఈ కరోనా టైం డైరెక్టర్స్ అందరికీ బిగ్ ఛాలెంజ్ విసిరిందన్నారు. ‘ఈ కరోనా టైంలో అందరూ ఇళ్లలోనే ఉండిపోవడం వలన ఓటిటి షోస్ కి బాగా అలవాటు పడ్డారు. అవి వదిలి మళ్ళీ థియేటర్స్ కి ప్రేక్షకులు రావాలంటే వాటికి మించిన కంటెంట్ తో మనం సినిమాలు చేయాలి. ఇదే డైరెక్టర్స్ ముందున్న బిగ్ ఛాలెంజ్. అలాగే అన్ని చిట్లా లగ్జరీస్ తగ్గించుకుంటే స్టార్స్ రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది. దాంతో సినిమా బడ్జెట్స్ కూడా కంట్రోల్ లోకి వస్తాయని’ రాజమౌళి తెలిపారు.

ఆయన చెప్పినవన్నీ వాలిద్ పాయింట్స్.. కాబట్టి దర్శకులు, నిర్మాతలు దీన్ని ఫాలో అయ్యి మళ్ళీ సినిమాకి థియేటర్స్ లో పూర్వ వాభావాన్ని తీసుకొస్తారేమో చూడాలి. అలాగే ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడి 2020 నుంచి 2021 జనవరి కి వెళ్ళింది. కరోనా ఎఫెక్ట్ వలన మళ్ళీ సినిమా రిలీజ్ వాయిదా పడి 2021 జులైకి వెళ్లనుందని సమాచారం.

Exit mobile version