సినిమా షూటింగ్ ప్రారంభం అయిన రెండుమూడు వారాల్లో ఎన్టీఆర్ కొమురం భీం లుక్ ను రివీల్ చేస్తామంటూ హామీ ఇచ్చాడు. దాంతో ఇన్నాళ్లు షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఎదురు చూశారు. చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా తర్వాత వెంటనే షూటింగ్ ను పునః ప్రారంభిస్తారట. ఈ విషయమై ఇప్పటికే రాజమౌళి తన ఇద్దరు హీరోలకు సమాచారం ఇచ్చాడట. దాంతో వారు మళ్లీ వర్కౌట్స్ మొదలు పెట్టారని తెలుస్తోంది.
రాజమౌళి దసరా తర్వాత షూటింగ్ అన్నాడు కనుక ఖచ్చితంగా దీపావళికి ఎన్టీఆర్ కొమురం భీం వీడియోను విడుదల చేయడం ఖాయం అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన అయితే రాలేదు. కాని అభిమానులు మరియు సినీ వర్గాల వారు దీపావళి పై ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు కూడా ఇప్పటికే రెండు సంవత్సరాల డేట్లను ఈ సినిమాకు ఖర్చు చేశారు. అందుకే మరీ ఎక్కువ సమయం వారిది వృదా చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ను పూర్తి చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది వారు వారి వారి కొత్త సినిమాల్లో నటించుకునేలా జక్కన్న ఈ ప్లాన్ చేశాడు.