ఇది కాసేపు పక్కనబెట్టి, సినిమా షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే ఇటీవలే అలియా భట్ కూడా నవంబర్ నుంచి పూర్తి ఫుల్ డేట్స్ ఇవ్వడంతో ఇక షూటింగ్ ఆగే ప్రసక్తే లేదు అనుకున్నారు. కానీ రాజమౌళి అనుకున్న పలు విషయాల్లో కాంప్రమైజ్ కాక తప్పడంలేదని తెలుస్తోంది. అదేమిటంటే, మొదటగా రామ్ చరణ్ – అలియా భట్ ఎపిసోడ్స్ ని పూణేలో షూట్ చేయాలనీ లొకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు.అలాగే నల్గొండ, గుజరాత్ లలో కూడా కొన్ని సన్నివేశాలను షూట్ చేయాలనుకున్నారు..
కానీ ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వల్ల రిస్క్ తీస్కొని, ఇంత భారీ టీంతో అక్కడికి వెళ్లి చేయలేని పరిస్థితి కావడంతో జక్కన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చారు. హైద్రాబాద్లోని తాను అనుకున్న లొకేషన్స్ ని సెట్స్ గా వేసి తీసేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే సెట్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇలా పరిస్థితులని బట్టి ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చేస్తున్నారే తప్ప షూటింగ్ మాత్రం అస్సలు ఆగకుండా చూసుకుంటున్నారు. అనుకున్న టైంకి సినిమాని పక్కాగా ఫినిష్ చేయాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది