దాంతో జక్కన్న అన్నింటిని జాగ్రత్తగా పరిశీలించే ఉద్దేశ్యంతో రాత్రులు కూడా వర్క్ చేస్తూ కో ఆర్డినేషన్ చేస్తున్నాడు. ప్రతి షాట్ ను ప్రతి సీన్ ను పదే పదే చూస్తూ దానికి కావాల్సిన మాడిఫికేషన్స్ ను చెప్తు వస్తున్నాడు.
షూటింగ్ లో విదేశీ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటున్న కారణంగా జక్కన్న బిజీ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా సినిమాను ఈ ఏడాది దసరా సందర్బంగా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అవి పుకార్లే అని ఖచ్చితంగా సినిమాను దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు ఉన్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.