ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ సినిమా?

`ప్రతి ముప్ఫై సంవత్సరాలకీ బ్రతుకు తాలూకూ ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు.. కానీ ప్రతి జనరేషన్ లోనూ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాణ్ణే టార్చ్ బేరర్ అంటారు. ఎళ్తున్నాడు చూశావా బాల్రెడ్డీ.. వాడే ఆ టార్చ్ బేరర్.` అరవింద సమేత` చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి రావు రమేష్ చెప్పిన డైలాగ్ లివి.

ఈ మూవీని డైరెక్ట్ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సీన్ ని ఈ డైలాగ్ లని ఎవరిని ఉద్దేశించి రాశారో.. ఎవరి స్ఫూర్తితో రాశారో కానీ ఈ మాటలు దర్శకధీరుడు రాజమౌళి విషయంలో మాత్రం అక్షర సత్యాలు. ఎందుకంటే ఇండియన్ సినిమా విషయంలో మాత్రం ఆ టార్చ్ బేర్ రాజమౌళి మాత్రమే. ఈ మాటలకు అర్హుడు తను మాత్రమే. ఈ మాటలు చెప్పడానికి బలమైన కారణం వుంది. ఇప్పడు ఇండియన్ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే `బాహుబలి`కి ముందు `బాహుబలి`కి తరువాత అని చెప్పక తప్పదు.

ఆ స్థాయిలో ఇండియన్ సినిమాల్లో మార్పులు శ్రీకారం చుట్టింది రాజమౌళి ఒక్కడే కాబట్టి. కొంత మంది కాపీ సీన్ లని హాలీవుడ్ కథల్లోని కీలక ఘట్టాలని తనదైన శైలిలో మార్చుకుని చేశాడని విమర్శలు చేయవచ్చు కానీ రాజమౌళి `బాహుబలి` చేసిన తరువాతే హాలీవుడ్ మేకర్స్ సైతం ఇండియన్ సినిమా వైపు తొంగి చూడటం మొదలుపెట్టారు. దశాబ్తాల క్రితం హాలీవుడ్ టెక్నిషియన్ లు భారతీయ చిత్రాలకు అందులోనూ ప్రత్యేమైన సినిమాలకు పని చేసినా ఈ మధ్యే మన సినిమాల్లో వారి పాత్ర అధికంగా పెరుగుతూ వస్తోంది.

ఇక ఇక్కడ మరో విషయం చెప్పాలి. టాలీవుడ్ సినిమా అంటే థియేట్రికల్ బిజినెస్ మాత్రమే.. కొన్ని చిత్రాలకు మోనోపలి కారణంగా థియేటర్లు కూడా లభించని పరిస్థితులు చూశాం. కొంత మంది మా చిత్రానికి థియేటర్లు లభించలేదని ఒకటి రెండు థియేటర్లు మాత్రమే ఇచ్చారని మీడియా ముందు వాపోయిన సంఘటనలూ చూశాం. కానీ `బాహుబలి` తరువాత ఆ సంఘటనలు లేవు. థియేటర్ మిస్సయితే ఇప్పుడు ఓటీటీ పిలుస్తోంది. తెలుగు సినిమా బిజినెస్ విస్తరించింది. మార్కెట్ పెరిగింది.. డిమాండ్ ఏర్పడింది.

మార్కెట్ స్థాయి పెరిగింది. మన సినిమా వస్తోందంటే యావత్ భారతం అటెన్ష్ తో ఎదురుచూసే రోజులొచ్చాయి. అసలు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే రోజుల నుంచి కాదు టాలీవుడ్ అనే రోజుల్లోకి వచ్చేశాం. మన సినిమా అంటే ఏముంది అన్నవాళ్లే ఇప్పుడు డబ్బింగ్ రైట్స్ కోసం ముందే క్యూ కట్టడం చూస్తున్నాం. ఉత్తరాదిలో ఒకప్పుడు తెలుగు సినిమాని చూసిన వారు లేరు కానీ ఇప్పడు పబ్లిసిటీ చేయకపోయినా ..

మా సినిమాని చూడండి అని అడగకపోయినా థియేటర్లు నిండిపోతున్నాయి. ప్రేక్షకులు మౌత్ పబ్లిసిటీతో వంద కోట్లు వసూళ్లు దాటేలా చేస్తున్నారు. ఇది ఏవరో చేసిన అద్భుతం కాదు. కేవలం రాజమౌళి అనే టార్చ్ బేరర్ చేసిన మార్పు. ఇండియన్ సినిమాని ప్రపంచ యవనికపై గౌర్యంగా నిలబెట్టిన రాజమౌళి నిజంగా ఇండియన్ సినిమాకు టార్చ్ బేరర్ అని చెప్పక తప్పదు. ఈ విషయాన్ని మనమే కాదు బాలీవుడ్ ప్రముఖులు కూడా ముక్త కంఠంతో అంగీకరిస్తుండటం విశేషం.

Exit mobile version