Advertisement

రాజ’శేఖర్’ రంగంలోకి దూకేశాడుగా!

Posted : August 11, 2021 at 8:17 pm IST by ManaTeluguMovies

నటుడు రాజశేఖర్ ఇప్పుడు భిన్నమైన రోల్స్ తో మన ముందుకు వస్తున్నాడు. కల్కి తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ 2-3 ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. సెట్స్ పై ఉన్న రాజశేఖర్ సినిమా ‘శేఖర్’. సెకండ్ వేవ్ కు ముందు షూటింగ్ మొదలైన ఈ చిత్రం ప్యాండెమిక్ కారణంగా నిలిచిపోయింది.

నాలుగు నెలలకు పైగా గ్యాప్ తర్వాత శేఖర్ మళ్ళీ మొదలైంది. ఈ చిత్రంలో రాజశేఖర్ డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తాడు. మలయాళం చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు నుండి శేఖర్ ఫ్రెష్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది.

కొత్త దర్శకుడు లలిత్ శేఖర్ ను తెరకెక్కిస్తున్నాడు. రాజశేఖర్ కూతుళ్లు శివాత్మిక, శివాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా వెంకట శ్రీనివాస్ బొగ్గరం సహ నిర్మిస్తున్నాడు. శేఖర్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే విడుదల కానుంది.


Advertisement

Recent Random Post:

ఇది జీర్ణించుకోలేని విషయం : Nallimilli Rama Krishna Reddy

Posted : March 28, 2024 at 11:35 am IST by ManaTeluguMovies

ఇది జీర్ణించుకోలేని విషయం : Nallimilli Rama Krishna Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement