Advertisement

రజినీకాంత్ సినిమా మరోసారి వాయిదా పడుతోందా?

Posted : June 18, 2020 at 2:05 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. గత నాలుగైదేళ్లుగా రజినీకాంత్ రేంజ్ కు తగ్గ హిట్ మాత్రం పడటం లేదు. సినిమాలు చేస్తున్నా ఎందుకో అవి తన ఫ్యాన్స్ ను అలరించడంలో విఫలమవుతూనే ఉన్నాయి. ఈ సంక్రాంతికి మురుగదాస్ తో చేసిన దర్బార్ కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.

దీంతో రజిని కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా కోలీవుడ్ లో పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అన్నాథే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆ తర్వాత సాగలేదు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు భావించారు.

కాకపోతే ఇప్పుడు షూటింగ్ ఆలస్యమవడంతో సినిమాను వాయిదా వేయక తప్పట్లేదని తెలుస్తోంది. దాదాపు ఇంకా ఆరు నెలలు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఈ చిత్రం ఇక పోస్ట్ పోన్ అవ్వక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కరోనా ఉధృతంగా ఉంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల పాటు షూటింగ్ మొదలుపెట్టే ఆస్కారం లేదు. ఇక సినిమాను వాయిదా వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు.


Advertisement

Recent Random Post:

DJ Dhamaka in Sydney – 28th April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Posted : April 23, 2024 at 2:07 pm IST by ManaTeluguMovies

DJ Dhamaka in Sydney – 28th April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement