ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రజినీకాంత్ అన్నత్తే షూటింగ్ కూడా వాయిదా

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వరసగా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50 మందితో మాత్రమే షూటింగ్ చేసుకోవాలన్న నిబంధనను తీసుకొచ్చారు. భారీ, మీడియం బడ్జెట్ సినిమాల చిత్రీకరణ కోవిద్ కారణంగా మరోసారి నిలిచిపోయింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం అన్నత్తై. ఈ చిత్ర షూటింగ్ గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రజినీకాంత్ ఆరోగ్యం కుదుటపడడం, తగినంత విశ్రాంతి తీసుకోవడంతో అన్నత్తే షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టారు.

అయితే తిరిగి మొదలైన కొన్ని రోజులకే ఈ చిత్ర షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నత్తే కాస్ట్ అండ్ క్రూ తిరిగి చెన్నై చేరుకుంటున్నారు. రజినీకాంత్ స్పెషల్ ఫ్లయిట్ లో చెన్నై ఈరోజు బయల్దేరతారు. శివ ఈ సినిమాకు దర్శకుడు.

Exit mobile version