Advertisement

రకుల్ ప్రీత్ సినిమా సెట్స్ పై రాళ్లు రువ్విన స్థానికులు

Posted : February 23, 2021 at 10:15 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఎటాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జులై 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజా షెడ్యూల్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని ధనిపూర్ లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా డమ్మీ బాంబ్ బ్లాస్ట్ చేయగా ఆ శబ్దానికి స్థానికులు కంగారు పడ్డారు.

అయితే సినిమా షూటింగ్ అని తెలుసుకుని భారీ సంఖ్యలో గుమిగూడారు. స్థానికులు ఇబ్బంది కలిగిస్తుండడంతో సెక్యూరిటీ అడ్డుకోగా కోపం తెచ్చుకున్న వారు సెట్స్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సెక్యూరిటీ వారికి స్వల్ప గాయాలవ్వగా మూవీ కాస్ట్ అండ్ క్రూ కు ఎటువంటి హాని జరగలేదని సమాచారం.


Advertisement

Recent Random Post:

వర్జీనియాలో కాల్పులు,14మంది మృతి

Posted : November 23, 2022 at 2:12 pm IST by ManaTeluguMovies

Watch వర్జీనియాలో కాల్పులు,14మంది మృతి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement