Advertisement

ఫోటోటాక్ : వావ్ రకల్… ఆ చూపుకు ఎంతటి వాడైనా పడిపోవాల్సిందే

Posted : March 26, 2022 at 7:16 pm IST by ManaTeluguMovies

కెరటం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా 2011 సంవత్సరంలో రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అయ్యింది. ఆ సినిమా తో రకుల్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కాని 2013 సంవత్సరంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో అనూహ్యంగా రకుల్ ప్రీత్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.

అంతకు ముందు వరకు కన్నడం మరియు తమిళ సినిమాలు చిన్నవి చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకుంటూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కింది. వరుసగా సినిమాల్లో నటిస్తూ అనూహ్యంగా ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీగా నటించే స్థాయికి చేరింది. దాదాపు అయిదు సంవత్సరాల పాటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఏడు సినిమా లతో రాబోతుంది. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. వీటిలో రెండు మూడు సక్సెస్ అయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావచ్చు అంటున్నారు.

రికార్డ్ స్థాయిలో సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత విషయంలో కూడా రికార్డ్ సృష్టిస్తుంది. తన ఇన్ స్టా పేజీలో రెగ్యులర్ గా అత్యంత అదమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మిలియన్ ల కొద్దీ తనకు ఉన్న ఫాలోవర్స్ ను ఆనందింపజేస్తుంది. ఆమె హాట్ ఫోటో షూట్స్ కుర్ర కారుకు మత్తెక్కించేవిగా ఉంటాయి. ప్రతి ఒక్క ఫోటో షూట్ లో కూడా వావ్ అనిపిస్తూ.. అంతకు ముందు ఫోటో షూట్ కంటే ఇంకా ఎక్కువ అందంగా ఉంది అనిపించుకుంటుంది.

తాజాగా ఈ కలర్ ఫుల్ కాస్ట్యూమ్ లో రకుల్ సందడి చేసింది. లైట్ గా క్లీ వేజ్ షో చేస్తూ అలా ఓర కంట చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చూపుకు ఎంతటి మగాడైనా పడి పోవాల్సిందే. అమ్మాయిలు కూడా ఈ అందమైన అమ్మాయిని చూసి కుళ్లుకోవాల్సిందే అంటున్నారు. ఇంత అందగత్తెను టాలీవుడ్ స్టార్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ అయితే తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేయదేమో అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆమె సినిమాలు హిందీ నుండి తెలుగు లో డబ్ అవ్వాలని కోరుకుంటున్నారు. మొత్తానికి రకుల్ ఫోటో లతో మరోసారి టాలీవుడ్ లో కూడా రచ్చ చేస్తుంది అనే నమ్మకంను కలిగిస్తుంది. అది ఎప్పుడు అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

DJ Dhamaka in Sydney – 28th April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Posted : April 23, 2024 at 2:07 pm IST by ManaTeluguMovies

DJ Dhamaka in Sydney – 28th April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement