Advertisement

మెడికల్‌ షాప్‌లో మద్యం అమ్ముతారా.. ట్రోల్స్‌పై రకుల్‌ రియాక్షన్‌

Posted : May 8, 2020 at 7:21 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాస్క్‌ పెట్టుకుని హడావుడిగా రోడ్డు దాటుతూ ఉంది. అది అక్కడే ఒక్క ఒక వ్యక్తి వీడియో తీసి నెట్‌ లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి వైపు కూడా చూసిన రకుల్‌ ఏదో మాట్లాడినట్లుగా అనిపించింది. రకుల్‌ వైన్స్‌ కు వెళ్లిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభం అయ్యింది.

వైన్స్‌కు వెళ్లిన రకుల్‌ ఎవరు చూడకుండా హడావుడిగా మందు తీసుకుని అక్కడ నుండి వెళ్లి పోయిందనే కామెంట్స్‌ పెద్ద ఎత్తున వచ్చాయి. తన గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు వెంటనే రకుల్‌ స్పందించింది. కొన్ని గంటల వ్యవధిలోనే వీడియో వైరల్‌ అవ్వడంతో పాటు ట్రోల్స్‌ విపరీతంగా రావడంతో స్పందించిన రకుల్‌ నెటిజన్స్‌ పై విరుచుకు పడినది.

మెడికల్‌ షాప్‌ లో ఆ్కహాల్‌ కూడా అమ్ముతారా. వావ్‌ ఈ విషయం నాకు తెలియదే అంటూ కాస్త వ్యంగంగా నెటిజన్స్‌కు కౌంటర్‌ ఇచ్చింది. రకుల్‌ ఈమద్య కాలంలో చేసిన సినిమాలు ఏమీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయాయి. దాంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఈమెకు ఆఫర్లు చాలా వరకు తగ్గాయి. హిందీలో అయినా అవకాశాలు వస్తాయా అనే ఉద్దేశ్యంతో అక్కడ ప్రయత్నాలు చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అయిన రకుల్‌ ఇలా మెడికల్‌ షాప్‌ కు వెళ్తే వైన్స్‌కు వెళ్లిందంటూ ప్రచారం మొదలు పెట్టారు.


Advertisement

Recent Random Post:

War Of Words Between Vellampalli Srinivas And Bonda Uma Over CM Jagan Stone Incident

Posted : April 20, 2024 at 12:18 pm IST by ManaTeluguMovies

War Of Words Between Vellampalli Srinivas And Bonda Uma Over CM Jagan Stone Incident

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement