తనకెంతో ఇష్టమైన ఫుడ్, ఫిల్మ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫిట్నెస్ గురించి చెబుతూ ఈ ఛానెల్‌లో వీడియోలు పెడుతుందట. అయితే ఇక్కడ రకుల్ ఓ స్ట్రాటెజీ వాడిందండోయ్. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయమంతా ప్రధానమంత్రి సహాయనిధికి ఇస్తానంటోంది రకుల్. ఇంట్లో ఖాళీగా ఉండలేక, ఇలా రకరకాల వీడియోలు చేయడం చాలామంది హీరోయిన్లకు అలవాటు అయిపోయింది.
వంటలు చేస్తూ, ఇంటి పనులు చేస్తూ, పాటలు పాడుతూ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో నింపుతున్నారు చిన్నపెద్దా హీరోయిన్లు. రకుల్ దాన్నే యూట్యూబ్ ఛానెల్‌లో వేసి, డబ్బులు సంపాదిస్తానంటోంది. కొన్నిరోజుల దాకా యూట్యూబ్ ఆదాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తుందన్నమాట. అదే మరి రకుల్ పాప తెలివి.
అయితే ఇప్పటికే యుట్యూబ్ ఛానల్స్ ను ప్రారంభించిన ఆలియా భట్, జాక్విలైన్ ఫెర్నాండెజ్ వంటి భామలు మాత్రం అక్కడ పెద్దగా నెట్టుకురాలేకపోతున్నారు. సబ్ స్ర్కైబర్లు బాగానే పెరిగా కూడా.. వారం వారం కంటెంట్ వేయడం అంటే వారికి చెమట్లు పడుతోంది. చూద్దాం రకుల్ ఏం చేస్తుందో!!