ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డాం మరియు ఇష్టపడి పని చేశాం. సినిమా విడుదలకు ముందు కాస్త టెన్షన్ పడ్డాను. రివ్యూలు ఎలా వస్తాయో ప్రేక్షకుల నుండి స్పందన ఎలా ఉంటుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. మీరంతా మంచి వసూళ్లను ఇచ్చి థ్రిల్ చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం దేవదాసు సినిమాతో మీ ముందుకు మొదటి సారి వచ్చాను. మళ్లీ ఈ సంక్రాంతికి రెడ్ సినిమాతో నాకు సక్సెస్ ను ఇచ్చారు. ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు అని నన్ను చాలా సార్లు మీడియా వారు అడుగుతూ ఉంటారు. కాని నాకు పోటీ ఇండస్ట్రీలో వారు కాదు అభిమానులే నాకు పోటీ. మీరు నాపై చూపించే ప్రేమ ఎక్కువనా.. నేను సినిమాపై చూపించే ప్రేమ ఎక్కువనా అనేది ఇద్దరి మద్య పోటీగా ఉందని చెప్పుకొచ్చాడు.