నిజ పాత్రలను తీసుకుని దానికి ఫిక్షన్ ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. టాప్ స్టార్స్ ఈ సినిమా కోసం పనిచేస్తుండడంతో ఆటోమేటిగ్గా అంచనాలు పెరిగిపోయాయి. ముందు జనవరికి ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక అసలు విషయానికొస్తే ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, తారక్ యంగ్ వెర్షన్లు, అంటే వాళ్ళ చిన్నప్పటి పాత్రలు కూడా ఉంటాయి. ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో చిన్నారులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా చక్రి, వరుణ్ బుద్ధదేవ్, స్పందన చతుర్వేది నటిస్తున్నట్లు తెలుస్తోంది. వారి వారి సోషల్ మీడియా అకౌంట్లలో ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ తో దిగిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
చక్రి ప్రతిరోజూ పండగే, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో నటించాడు. అతను కొమరం భీమ్ చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నాడు. దీన్ని బట్టి వరుణ్ బుద్ధదేవ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, స్పందన చతుర్వేది సీత పాత్రలో కనిపిస్తారు.