ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ ప్రధాన పాత్రలో కనిపించబోయే చిత్రం గురించి బోలెడన్ని ఊహాగానాలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే ఎన్ని రూమర్స్ వస్తున్నా వాటిలో నిజం లేదని కొద్ది రోజులకే బయటపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మాకు అందిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం రామ్ చరణ్, తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం.
మోహన్ రాజా తమిళంలో తెరకెక్కించిన తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి రామ్ చరణ్ తో ధ్రువగా తెరకెక్కించి సూపర్ హిట్ అందించాడు. ఇక మోహన్ రాజా – రామ్ చరణ్ కు సంబంధించిన మూవీ అప్డేట్ పై త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.