ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎక్స్ క్లూజివ్: చిరు కోసం రంగంలోకి దిగిన చరణ్ విలన్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. అయితే చిరంజీవి మాత్రం షూటింగ్ లో ఇంకా పాల్గొనలేదు. రేపటినుండి చిరంజీవి ఆచార్య షూటింగ్ లో పాల్గొంటాడని తెలిసింది. రీసెంట్ గా సమంత సెలబ్రిటీ షో సామ్ జామ్ లో చిరంజీవి గెస్ట్ గా వెళ్ళాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ను స్ట్రీమ్ చేస్తారు.

ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే. అలాగే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారు అన్న విషయంపై సస్పెన్స్ మొత్తానికి తొలగిపోయినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ నటుడు అరవింద్ స్వామి ఆచార్యలో విలన్ గా నటిస్తాడట.

కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ధ్రువలో అరవింద్ స్వామి విలాన్ గా నటించిన విషయం తెల్సిందే. అరవింద్ స్వామి స్టైలిష్ విలనిజానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు చరణ్ కు విలన్ గా నటించిన అరవింద్ స్వామి ఇప్పుడు చిరుకు కూడా విలన్ గా నటిస్తున్నాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా జరుగుతోంది. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.

Exit mobile version