ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆచార్యలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తనదేమి చిన్న పాత్ర కాదన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక నాన్నతో కలిసి నటించడం తన అదృష్టమని పేర్కొన్నాడు చరణ్.
గతంలో మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో చిరు గెస్ట్ పాత్ర వేయగా, ఖైదీ నెం 150లో చరణ్ ఒక పాటలో మెరిశాడు. మొదటిసారి వీరిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో నటిస్తుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.