ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శంకర్ పెట్టే పరీక్షలో చరణ్ పాస్ అయ్యేనా?

చరణ్‌ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ దాదాపుగా ముగించేశాడు. ఇక ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌ కాస్త అటు ఇటుగా నెల రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. జులై నుండి శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో చరణ్‌ సినిమా మొదలు కాబోతుంది. ఈ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కథ తండ్రి కొడుకుల మద్య సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొదట శంకర్‌ తండ్రి పాత్రకు సీనియర్‌ నటుడిని తీసుకోవాలని భావించాడు. అందుకు చరణ్‌ ఒప్పుకోకుండా తానే ఆ పాత్రను చేస్తానన్నాడట.

తండ్రి పాత్రను చేసేందుకు చరణ్‌ కు మొదట మేకప్ టెస్టు ను నిర్వహించబోతున్నారు. మేకప్ సెట్‌ అయ్యి లుక్‌ సరిపోతే అప్పుడు తండ్రి కొడుకుల పాత్రలో చరణ్ నటించే అవకాశం ఉంది. అలా కాకుండా తండ్రి పాత్రకు చరణ్ లుక్ సెట్‌ అవ్వకుంటే మరో నటుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. చరణ్‌ 50 ఏళ్ల వయసు వ్యక్తి లుక్‌ తో మెప్పించగలడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు శంకర్ కు పూర్తి సంతృప్తిని కలిగిస్తేనే ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది. మరి శంకర్‌ పరీక్షలో చరణ్ పాస్ అయ్యేనా చూడాలి.

Exit mobile version