Advertisement

చరణ్ 15 సెకండ్ షెడ్యూల్ ఇలా జరుగుతోంది

Posted : November 15, 2021 at 6:50 pm IST by ManaTeluguMovies

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా మొదటి షెడ్యూల్ ను పుణె లో నిర్వహించారు. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారనే వార్తలు వస్తున్నాయి. ఆ యాక్షన్ సన్నివేశాలకు గాను హెలికాప్టర్ ను వినియోగించారనే ప్రచారం కూడా జరిగింది.

దాదాపుగా రెండు వారాల షార్ట్ షెడ్యూల్ ను పుణెలో ముగించి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చేసిన చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే సెకండ్ షెడ్యూల్ ను కూడా షురు చేయడం జరిగింది. నేటి నుండి ప్రారంభం అవ్వబోతున్న ఆర్ సీ 15 సినిమా చిత్రీకరణ లో భాగంగా పాట ను షూట్ చేస్తున్నట్లుగా జానీ మాస్టర్ ట్వీట్ ను చూస్తే అర్థం అవుతోంది. సెకండ్ షెడ్యూల్ లో ఒక పాటను భారీ ఎత్తున దర్శకుడు ప్లాన్ చేసినట్లుగా ఉన్నాడు.

హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక భారీ సెట్ ను వేయించిన శంకర్ ఈ పాటను అందులో షూట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ కూడా ఈ షూట్ లో పాల్గొనబోతుంది. ఇద్దరి మద్య సాగే రొమాంటిక్ సాంగ్ ను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ తో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పాటతో పాటు కీలక సన్నివేశాలను కూడా షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకోసం కూడా సెట్ నిర్మాణం పూర్తి అయ్యింది. కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన శంకర్ వెంటనే పాటల చిత్రీకరణ మొదలు పెట్టడం చూస్తుంటే తన సహజ సిద్ద వైఖరికి భిన్నంగా ఈ సినిమాను శంకర్ చాలా స్పీడ్ గా ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ మరియు కియారా అద్వానీలు ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు. మళ్లీ వీరి కాంబో సినిమా అంటే కాస్త మెగా అభిమానులు అనుమానం పెట్టుకున్నా.. శంకర్ సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని.. ఒక మంచి సినిమా గా కూడా జనాలు మాట్లాడుకునేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను దక్కించుకోవడం కోసం ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జక్కన్న వంటి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ తో సినిమా చేసిన రామ్ చరణ్ ఆ వెంటనే మరో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ తో సినిమా ను చేసే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.


Advertisement

Recent Random Post:

జగన్ సెల్ఫీ ఫొటోస్ పై రఘు రామ కౌంటర్లు | MP Raghu Rama Krishnam Raju Comments on Jagan

Posted : December 4, 2021 at 1:32 pm IST by ManaTeluguMovies

Watch జగన్ సెల్ఫీ ఫొటోస్ పై రఘు రామ కౌంటర్లు | MP Raghu Rama Krishnam Raju Comments on Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement