ఆర్ ఆర్ ఆర్ కాకుండా రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించాల్సి ఉంది. చిరంజీవికి శిష్యుడిగా నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా తర్వాతి చిత్రం ఏమిటనే సందేహం అందరిలోనూ ఉంది. గత కొంత కాలం నుండి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఈ దర్శకుడితోనే అంటూ పలు రకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి.
కొత్త దర్శకుడితో రామ్ చరణ్ సినిమా ఉంటుందని, కాదు ఉప్పెన దర్శకుడితోనే అని, అది కూడా కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందని, ఇలా రకరకాల రూమర్లు షికార్లు చేసాయి. అయితే అవేమీ నిజం కావని తేలిపోయింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడని, కేసులు విపరీతంగా వస్తుండడంతో ఎటువంటి రిస్క్ తీసుకునే స్టేజ్ లో లేడని, ప్రస్తుతమున్న ప్రాజెక్టులు పూర్తైన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడని తెలుస్తోంది.