Advertisement

‘ఆచార్య’లో చరణ్.. రోల్ ఏంటో చెప్పేసిన చిరు

Posted : April 9, 2020 at 9:06 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి ఏ విషయాన్ని మనసులో దాచుకోలేరు. అలా ఓపెన్ అయిపోవడం వల్ల మెగాస్టార్‌కు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయాలని డైరెక్టర్ అండ్ టీమ్ పక్కగా ప్లాన్ చేసుకున్న పాయింట్స్ కాస్త ముందే రివిల్ అయిపోతున్నాయి. మరోసారి మెగాస్టార్ ఇలాగే ‘ఆచార్య’గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేశారు.

చాలారోజుల నుంచి ‘ఆచార్య’ సినిమాలో ఓ అద్భుతమైన రోల్ కోసం మహేష్‌ను సంప్రదించారని టాక్ నడిచింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఆ స్పెషల్ క్యారెక్టర్‌లో మెగా తనయుడు రామ్ చరణ్‌ కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ఈ న్యూస్‌ను కన్ఫార్మ్ చేయలేదు. మెగాస్టార్ ఈ సస్పెన్స్‌కు తెరతీశారు.

‘ఆచార్యలో ఓ స్పెషల్ రోల్‌లో రామ్ చరణ్‌ కనిపించబోతున్నాడని… ఇందుకోసం తానే స్వయంగా రాజమౌళితో మాట్లాడి, చరణ్ ఓ నెలరోజులు తమ షూటింగ్‌లో పాల్గొనేలా ఒప్పించానని చెప్పారు చిరూ. అంతేనా… ఈ సినిమాలో తాము తండ్రికొడుకుల్లా కనిపించడం లేదని, గురు-శిష్యుల్లా మా పాత్రలు ఉంటాయని అసలు విషయం రివిల్ చేసేశారు మెగాస్టార్. చాలా గోప్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా చిరూ, ఇలా చెప్పేస్తుండడంతో కొరిటాల శివ అండ్ టీమ్ తలలు పట్టుకుంటోందట. అయితే సినిమా ప్రమోషన్‌లో ఇది కూడా ఓ స్ట్రాటెజీయే అంటున్నారు కొందరు.

ఇక మెగాస్టార్ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడని, ఏ రోల్‌లో కనిపిస్తాడనేది ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మెగాస్టార్.


Advertisement

Recent Random Post:

Neethone Dance 2.0 – Full Promo | Old is Gold Round | Every Sat & Sun at 9 PM

Posted : April 17, 2024 at 8:48 pm IST by ManaTeluguMovies

Neethone Dance 2.0 – Full Promo | Old is Gold Round | Every Sat & Sun at 9 PM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement