Advertisement

వర్మకి తెలంగాణ హైకోర్టు లో ఊరట

Posted : May 27, 2022 at 8:18 pm IST by ManaTeluguMovies

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పోలీసు కేసులు నమోదు అవ్వడం కొత్తేం కాదు. ఇటీవల దిశ ఎన్ కౌంటర్ సినిమా ఫైనాన్షియర్ శేఖర్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనకు 56 లక్షల రూపాయలు వర్మ ఇవ్వాలని.. ఆ డబ్బు ఇవ్వాలని అడిగితే తనను బెదిరిస్తున్నాడు అంటూ శేఖర్ రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలకు సిద్దం అవుతున్న సమయంలో వర్మకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన వర్మ వాదనలు విన్న కోర్టు సంతృప్తి చెంది తెలంగాణ పోలీసులు తదుపరి చర్యలకు వెళ్లకూడదని.. విచారణ పూర్తి అయ్యేంత వరకు వర్మ ను అరెస్ట్ చేయడం కాని.. ఆయనపై ఇతర చర్యలు తీసుకోవడం కాని చేయవద్దంటూ ఆదేశించింది.

కోర్టు లో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియ జేశాడు. ప్రస్తుతం కోర్టు కు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్న కారణంగా ఇతర విషయాలను ఆయన స్పందించలేదు.

వర్మ ఇలాంటి కేసులను.. పిటీషన్ లను ఎన్నో చూశాడు. కనుక ముందు నుండే వర్మ దీని నుండి ఈజీగానే బయట పడుతాడు అని అంతా అనుకున్నారు.

అంతా భావించినట్లుగానే వర్మ చాలా ఈజీగా వర్మకు ఊరట దక్కింది. కోర్టు లో వాదనలు పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు శేఖర్ రాజు కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఉండదు. దాంతో ఏళ్లకు ఏళ్లు వర్మ సేఫ్ గా ఉండవచ్చు.

వర్మ ఈ మద్య కాలంలో పలు సినిమాల విషయంలో లావాదేవీల వ్యవహారంలో వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే వర్మ ముందు ముందు మరింతగా కూరుకు పోతాడేమో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

AP BJP : కీలక సమావేశానికి సీనియర్ల డుమ్మాకు కారణమేంటి..?

Posted : March 26, 2024 at 9:14 pm IST by ManaTeluguMovies

AP BJP : కీలక సమావేశానికి సీనియర్ల డుమ్మాకు కారణమేంటి..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement