ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రామ్ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్ విడుదలకు ముందు కరోనా సంక్షోభం కారణంగా ఆగిపోయిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కానీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు బంద్ అవ్వడంతో రిలీజ్ నిలిచిపోయింది. రెడ్ తో పాటు పలు తెలుగు సినిమాలు కూడా విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఓటిటి. థియేటర్లు మరో రెండు, మూడు నెలల వరకూ తెరుచుకునే వీలయితే లేదు. దీంతో చాలా మంది నిర్మాతలు అంతకాలం వడ్డీల భారం భరించలేక ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నారు.

ఇదే క్రమంలో రెడ్ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలవుతుందా అన్న అనుమానాలు కలిగాయి చాలా మందికి. ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ తో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని రెడ్ టీమ్ ఖండించింది. ఈ చిత్రాన్ని వెండితెర మీద చూసి ఆనందించాలని, ఈ సినిమా థియేటర్లో చూస్తేనే అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రామ్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా అనేది కొంత మందికి ప్యాషన్, చాలా మందికి వ్యాపారం, తక్కిన వారికి జూదం. ప్రతి ఒక్కరూ వారి వారి కోణం నుండి సినిమాను చూస్తున్నారని ట్వీట్ చేసాడు రామ్. అయితే ఈ ట్వీట్ లో ఇన్నర్ మీనింగ్ ఏమైనా ఉందా? ప్రస్తుతం జరుగుతున్న థియేటర్ వెర్సస్ ఓటిటి చర్చకు దీనికి ఏమైనా లింక్ ఉందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఏమో మరి అది రామ్ కే తెలియాలి.

Exit mobile version