Advertisement

వెంకీ లవ్‌ స్టోరీకి ఓకే చెప్పిన ఎనర్జిటిక్ స్టార్‌

Posted : January 27, 2021 at 3:04 pm IST by ManaTeluguMovies

‘ఛలో’ మరియు ‘భీష్మ’ సినిమాలతో సక్సెస్‌ లను దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఒక సినిమా ఓకే అయ్యింది. సంక్రాంతికి రెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ నిరాశ పర్చాడు. రెడ్‌ తర్వాత ఖచ్చితంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎన్టీఆర్‌ 30 సినిమా పట్టాలెక్కేందుకే ఇంకా చాలా సమయం ఉంది. కనుక వచ్చే ఏడాది వరకు త్రివిక్రమ్‌ ఖాళీ గా ఉండే అవకాశం లేదు. కనుక రామ్‌ అప్పటి వరకు వెయిట్‌ చేయడం ఎందుకు అనుకున్నాడేమో అందుకే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న దర్శకుడు వెంకీ కుడుముల తాజాగా రామ్ కోసం ఒక లవ్‌ స్టోరీని సిద్దం చేశాడట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని అతి త్వరలోనే సినిమాను కూడా సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేయడంతో పాటు విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణం సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందంటున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

ISRO Successfully Tested RLVEX-02 Reusable Vehicle Launch | in Chitradura

Posted : March 23, 2024 at 1:05 pm IST by ManaTeluguMovies

ISRO Successfully Tested RLVEX-02 Reusable Vehicle Launch | in Chitradura

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement