మొదటి సినిమానే సిల్వర్ జూబ్లీ ఆడటంతో పాటు మాస్ ఆడియన్స్ మరియు క్లాస్ ఆడియన్స్‌కు దగ్గర అయ్యాడు. మొదటి సినిమానే సూపర్బ్ క్రేజ్ తెచ్చి పెట్టడంతో రామ్ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన రెడీ చిత్రం యూత్ ఆడియన్స్‌కు రామ్‌ను మరింతగా చేరువ చేసింది. రామ్‌లో కామెడీ యాంగిల్‌ను చూపించడంతో పాటు ఇలాంటి కామెడీ కూడా చేయవచ్చా అన్నట్లుగా ఆ సినిమా ఉంటుంది. దాంతో రామ్‌కు స్టార్‌డం మరింతగా పెరిగింది.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన కందిరీగ సినిమా రామ్‌కు మరో ఎనర్జిటిక్ సూపర్ హిట్‌ను తెచ్చి పెట్టింది. ఆ సినిమా సక్సెస్‌తో రామ్ యంగ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం మొదలు పెట్టాడు. కందిరీగ చిత్రంలో రామ్ నటన మరియు కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రామ్ చేసిన సినిమాలు ఎక్కువ శాతం కందిరీగ మరియు ఢీ సినిమాలను పోలి ఉండటంతో పాటు నటన విషయంలో పెద్దగా కొత్తదనంను చూపించలేక పోయాడు అనే విమర్శలు వచ్చాయి.
రొటీన్ సినిమాలు చేయడంతో రామ్‌కు కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడే నేను శైలజ చిత్రంతో మళ్లీ రామ్ పుంజుకున్నాడు. యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన నేను శైలజ చిత్రం రామ్ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టింది. దాని తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. రామ్ చివరగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.
ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ ను కొత్తగా చూపించింది. రామ్‌లోని అన్ని యాంగిల్స్‌ను పూరి ఉపయోగించుకుని తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ అని చెప్పవచ్చు. రామ్ ప్రస్తుతం ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విపత్తు లేకుండా ఉంటే ఇప్పటి వరకు రెడ్ చిత్రం విడుదల అయ్యి ఉండేది. ఆ తర్వాత సినిమాను కూడా రామ్ షురూ చేసేవాడు.
ఎనర్జిటిక్ స్టార్ బ్రాండ్ ను కాపాడుకుంటూ తన ప్రతి సినిమాలో కూడా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ను కనబర్చుతూ వస్తున్న రామ్‌కు తెలుగు బులిటెన్ టీం తరపున మరియు ఆయన అభిమానుల తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
భవిష్యత్తులో రామ్ మరిన్ని మంచి సినిమాలను చేసి ఆయన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించాలంటూ ఆశిస్తున్నాం.