ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విషాదం: ప్రముఖ కళా దర్శకుడు కన్నుమూత

భారతీయ చిత్ర సీమ మరో సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ తమిళ ఆర్ట్ డైరక్టర్ ఐదు సార్లు జాతీయ అవార్డు గ్రహీత పి. కృష్ణమూర్తి (77) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం తన నివాసంలో కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలపై తీసిన చిత్రాలకు పని చేశారు. ఆర్ట్ చిత్రాలకు, ఆఫ్ బీట్ చిత్రాలకు కృష్ణమూర్తి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.

కృష్ణమూర్తి తన చివరి చిత్రంగా గణిత మేధావి రామానుజన్ సినిమాకు పని చేశారు. 2014లో ఈ సినిమా విడుదలైంది. 1975లో ‘హంస గీత’ అనే కన్నడ చిత్రంతో ఆయన కళా దర్శకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుడు భైరవి వెంకటసుబ్బయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. సినిమాల్లోకి రాకముందు కృష్ణమూర్తి థియేటర్ నాటకాలు, నృత్య ప్రదర్శనలకు సెట్స్ వేసేవారు.

Exit mobile version