ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఈరోజే శంకర్ – రామ్ చరణ్ – దిల్ రాజు సినిమా ప్రకటన?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ తో కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం నుండి ఈ సినిమాకు సంబంధించి రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈరోజే సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతోందని సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ రావడం ఖాయం. అందుకు తగ్గట్లుగానే తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. అందుకే శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడు.

మరోసారి కమర్షియల్ కథాంశానికి సోషల్ మెసేజ్ తోడు కాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఆ సినిమా స్టేటస్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఏదేమైనా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చే వార్తే మరి.

Exit mobile version