రానా పెళ్లి వాయిదా పై మీడియాలో వస్తున్న వార్తల గురించి సురేష్‌బాబు స్పందించాడు. మీడియాలో పుకార్లను నమ్మవద్దంటూ సూచించాడు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రకటించాడు. ప్రభుత్వం వారి సూచనల మేరకే పెళ్లిని నిర్వహించబోతున్నట్లుగా సురేష్‌బాబు పేర్కొన్నాడు. ఈ సమయంలో పెళ్లిని వాయిదా వేయాలనే ఉద్దేశ్యం తమకు లేదంటూ ఈ సందర్బంగా సురేష్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మిహికా బజాజ్ తో ప్రేమలో ఉన్న రానా ఇరు కుటుంబాలను ఒప్పించి మెప్పించి పెళ్లికి రెడీ అయిన విషయం తెల్సిందే. పలువురితో ప్రేమలో ఉన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని రానా మాత్రం ఆ ప్రేమ వార్తలను కొట్టి పారేశాడు. ఎట్టకేలకు తన జీవిత భాగస్వామి విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సుదీర్ఘ కాలంగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రానా ఎట్టకేలకు ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు. ఇక రానా ప్రస్తుతం విరాటపర్వం మరియు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.